పొగాకు దొంగలు అరెస్ట్
ముండ్లమూరు మండలం పసుపుగల్లు గ్రామంలో వైట్ బర్లీ పొగాకు దొగతనం కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై సంపత్ కుమార్ తెలియజేసారు. శనివారం తెల్లవారుజామున మండలంలోని పులిపాడు వద్ద నిర్మిస్తున్న రైల్వే గేట్ వద్ద నిందితులు వెంకట నరుసు, కొమ్ముల చిన్న సుబ్బయ్య, గాలి ముట్టి బాబులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై చెప్పారు.వారి నుంచి 8 క్వింటళ్ల వైట్ బర్లీ పొగాకు, నాలుగు చక్రాల ఆటో స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై సంపత్ కుమార్ తెలిపారు.
