ముండ్లమూరు: రీ సర్వే పనులను పరిశీలించిన తహశీల్దార్
ముండ్లమూరు మండలం తమ్ములూరులో భూముల రీ సర్వే పనులను గురువారం తహశీల్దార్ నయీం అహ్మద్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... రీ సర్వే వలన భూములకు రక్షణ కలుగుతుందని తెలిపారు. భూముల విషయంలో సమస్యలు ఉన్న ఈ సర్వేలో పరిష్కారం అవుతాయని సూచించారు. డి సర్వే సమయంలో భూముల వద్ద రైతులు అందుబాటులో ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విఆర్వోలు, సిబ్బంది పాల్గొన్నారు.
