ముండ్లమూరు: బెల్టు షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు

ముండ్లమూరు మండలంలో బెల్టు షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై సంపత్ కుమార్ హెచ్చరించారు. ఎస్సై మాట్లాడుతూ అక్రమ మద్యం తరలింపు, బెల్ట్ షాపులు నిర్వహించడం చట్టరీత్యా నేరమని చెప్పారు. ఎవరైనా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న లేదా అక్రమ మద్యం తరలిస్తున్నట్లయితే సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఈ కార్యక్రమంలో తెలిపారు.

ముండ్లమూరు: బెల్టు షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు