ముండ్లమూరు :ప్రభుత్వ భూములను పరిశీలించిన ఒంగోలు ఆర్డీవో
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం ముండ్లమూరు మండలంలోని పలు గ్రామాల్లో ఒంగోలు ఆర్డీవో విశ్వేశ్వరరావు ప్రభుత్వ భూములను పరిశీలించారు. మండలంలోని పులిపాడు, పెద వులగల్లు, ఉమామహేశ్వరపురం, నూజిళ్ళపల్లిలో పలు భూములను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ నయీమ్ అహ్మద్, వీఆర్వోలు కోటయ్య, దయానందం, రమణ, పున్నారావు ఉన్నారు.
