ముండ్లమూరు : ఇళ్ల మధ్య కొండచిలువ కలకలం...
ముండ్లమూరు మండలం వేంపాడు గ్రామంలో మంగళవారం రాత్రి ఇళ్ల మధ్య కొండచిలువ కలకలం రేపింది. సుమారు ఎనిమిది గంటలు ఆ ప్రాంతంలో ఆరు బయట ఉన్న స్థానికులు ఒక్కసారిగా కొండ చిలవను చూసి భయభ్రాంతులకు గురయ్యారు. చాకచక్యంగా కొండ చిలువను పట్టుకుని ప్లాస్టిక్ సంచిలోకి వేసి ఊరి నుండి దూరంగా ఆరు బయట ప్రాంతంలో వదిలివేశారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు
