ముండ్లమూరు : కేజీబీవీ లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 2023- 2024 విద్యా సంవత్సరానికి 6వ తరగతి, ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్య అభ్యసించేందుకు ఆన్లైన్లో ఏప్రిల్ 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ప్రిన్సిపల్ ఆవుల సునీత మంగళవారం తెలిపారు.బడి బయట పిల్లలు,పేద పిల్లలు, అనాధ పిల్లలు, బడి మానివేసిన పిల్లలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బాలికలు అప్లై చేసుకోవాలని ఆమె తెలిపారు.
