పెద్ద ఉల్లగలులో రైతు సదస్సు
ముండ్లమూరు మండలం పెద్దఉల్లగల్లు గ్రామంలో రైతు సదస్సు, రైతులు- శాస్త్రవేత్తలతో చర్చ గోష్టి కార్యక్రమాన్ని కె వి కే ప్రధాన శాస్త్రవేత్త డా. ఎన్వివిఎస్ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వరి, కంది, మిరప పంటలలో చేపట్టవలసిన సాగు యాజమాన్య పద్ధతుల గురించి రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో రావెప్ విద్యార్థులు రైతుల సందర్శన నిమిత్తం వివిధ వ్యవసాయ ప్రదర్శనలను ఏర్పాటు చేశారు.
