ప్రకాశం :రైల్వే బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం.. HM మృతి
దర్శి మండలం పులిపాడు గ్రామ సమీపంలో ని శనివారం రైల్వే బ్రిడ్జి వద్ద ఆగి ఉన్న ట్రాక్టర్ ను ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం చల్లా గోవిందరాజు (46)బైక్ పై వస్తూ డీకొట్టాడు. ఈ ప్రమాదంలో అయన అక్కడికక్కడే మృతి చెందాడు.పోలిసుల కథనం మేరకు.. హనుమంతునిపాడు మండలం వెంకటరెడ్డిపల్లిలో ప్రాధమిక పాఠశాలలో చల్లా గోవిందరాజు HM గా పనిచేస్తున్నారు.అయన మృతితో పలువురు ఉపాధ్యాయులు, యూనియన్ సంఘాల నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.
