తాళ్లూరు: కుక్కల దాడులలో గొర్రెల మృతి

తాళ్లూరు మండలం చింతలపాలెంలో కుక్కలు దాడులు చేయడంతో 12 గొర్రెలు మృతి చెందాయి. శ్రీను గొర్రె పిల్లలను ఇంటి పక్కన దొడ్లో ఉంచి, కొన్ని గొర్రెలను పొలానికి తీసుకెళ్లాడు. సాయంత్రానికి కొన్ని కుక్కలు దొడ్లోకి చొరబడి గొర్రెలపై దాడులు చేశాయి. ఘటనలో 12 మృతి చెందగా నాలుగు గొర్రెలు గాయపడ్డాయి. సుమారు 50 వేల రూపాయలు నష్టం వాటిల్లిందని రైతు శ్రీను ఆవేదన వ్యక్తం చేశారు.

తాళ్లూరు: కుక్కల దాడులలో గొర్రెల మృతి