ప్రజలు, విద్యార్థులు మూఢనమ్మకాలను విడనాడి సాంకేతిక పట్ల అవగాహన పెంపొందించుకోవాలి
ప్రజలు, విద్యార్థులు మూఢనమ్మకాలను విడనాడి సాంకేతిక పట్ల అవగాహన పెంపొందించుకోవాలి
ప్రజలు, విద్యార్థులు మూఢనమ్మకాలను విడనాడి సాంకేతిక పట్ల అవగాహన పెంపొందించుకోవాలని యుటిఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ డి వీరాంజనేయులు అన్నారు. మండలంలోని శంకరాపురం గ్రామంలో ఆదివారం ప్రాథమిక పాఠశాల నందు అభ్యుదయ స్టడీ సర్కిల్, జన విజ్ఞాన వేదిక, యుటిఎఫ్ సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులు ప్రజలకు మూఢనమ్మకాలపై వ్యక్తిత్వ వికాసం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు .ఈ కార్యక్రమం కే కె కుమార్ అధ్యక్షతన జరిగినది. ఈ సందర్భంగా వీరాంజనేయులు మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు ప్రతి విషయాన్ని శాస్త్రీయ దృక్పథంతో చూడాలన్నారు. జన విజ్ఞాన వేదిక ప్రకాశం జిల్లా అధ్యక్షులు జయప్రకాష్ మాట్లాడుతూ నేడు ప్రతి ఒక్కరూ సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకొని తమ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలన్నారు. అద్దంకి నియోజకవర్గ ఎన్టీఆర్ కళా పరిషత్తు అధ్యక్షులు మన్నెంత్రిమూర్తులు మాట్లాడుతూ ఎవరు ఏది చెప్పినా గుడ్డిగా నమ్మకుండా ఎందుకు, ఏమిటి, ఎలా, అనే కోణంతో ఆలోచించుకొని నమ్మకంతో ముందుకు వెళ్లాలన్నారు. ఉపాధ్యాయులు కేకే కుమార్ మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు విద్యార్థులు వ్యక్తిత్వ వికాసం పెంపొందించుకోవాలన్నారు. గోగుల కోటేశ్వరరావు మాట్లాడుతూ జీవితంలో లక్ష్యాన్ని ఎంచుకొని అడుగులు ముందుకు వేయాలన్నారు. ఎర్రయ్య మాట్లాడుతూ మూఢనమ్మకాలకు స్వస్తి పలికి సాంకేతికత పై పట్టు సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో కే నిరంజన్, పి కృష్ణారావు, పి శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు, విద్యార్థులు విద్యార్థులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.