తెలుగు భాష దినోత్సవం స్పెషల్ స్టోరీ

తెలుగు భాష దినోత్సవం స్పెషల్ స్టోరీ
తెలుగు భాష తియ్యదనం

భాష భావవ్యక్తీకరణకు మార్గం.

అంతర్జాతీయ 

..ప్రాంతీయ భాషా దినోత్సవం జరుపుకుంటున్న భారత్..

.. ప్రాంతీయ భాషలో మరిన్ని మార్పులు చేర్పులు వస్తే బాగుంటుంది..

BSR News  Web Desk:

ఎదుటి వ్యక్తి అభిప్రాయాల్ని తెలుసుకోవడానికి సాధనం భాష ఒక్కటే. భాష అంటే అక్షర రూపం. అక్షరానికి మరణం లేదు. అక్షరాల భాషతో కొనసాగుతున్న పదనిసలు నేటి మానవాళికి మార్గదర్శనమయ్యాయి.. కానీ భాషలు అనేకం. ప్రపంచ దేశాల్లో సుమారు 6700 భాషలు ఉన్నట్లు అంచనాలు ఉన్నాయి. ప్రపంచ దేశాలన్నీ ఒకే భాషలో మాట్లాడలేవు. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క ప్రాంతానికి ఒక భాష ప్రామాణికంగా ఉంటూ వస్తుంది. జాతీయ ప్రాంతీయ భాషలతో విద్యా, కరస్పాండెన్సీ, పరిపాలన, న్యాయవాదుల తీర్పులు, భాష తదిరూపంగా నిలుస్తు వస్తుంది. అక్షరాల అమరికలో మాట్లాడే భాష, పాటగా ముందుకు సాగుతున్న భాషలను మరింతగా అభివృద్ధి చేయాల్సి ఉంది. ఈ లక్ష్యంతో ఫిబ్రవరి 21న జరిగే అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని మనదేశంలో కూడా అందరూ జరుపుకుంటున్నారు.

 జాతీయ భాష.

దేశంలో జాతీయ భాషగా హిందీ కొనసాగుతుంది. కానీ నేడు ప్రపంచాన్ని మాత్రం ఇంగ్లీషు భాష ఏలుతుంది. ప్రపంచ దేశాల సంగతి ఎలా ఉన్నా… దేశ ,రాష్ట్రాల భాషలపై ప్రభుత్వాలు భాషలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపణలు ఉన్నాయి. మనుషుల మనోగతాలకు ప్రాంతీయ భావోద్వేగాలకు అనుగుణంగా భాషకు ప్రాణం కల్పించాల్సిన బాధ్యత దేశ రాష్ట్ర జాతీయ ప్రభుత్వాలపైన ఉంది.

దేశంలో భాషలు ఎన్నో.

భారతదేశం , ప్రపంచ దేశాల్లో ఉన్నత స్థానాలను భాష అధిరోహించిన మాట వాస్తవం. దేశభాషగా నేడు హిందీ కొనసాగుతుంది . కానీ మనదేశంలోను కూడా ఇంగ్లీష్ భాషకి పెద్దపీట కొనసాగుతుంది. ప్రాంతీయ భాషల విషయానికొస్తే.. దేశంలో తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడం ,గుజరాతి, మలయాళం ,బెంగాలీ ,అస్సామీ, పంజాబీ, ఒడిశా భాషలతో పాటు అనేక ప్రాంతీయ భాషలు వాడుకలో ఉన్నాయి. మన దేశంలో మానవాళి మనుగడకు భాష ఎంతో దోహదపడుతుంది. భాషకు అక్షర రూపం అందించిన వారికి అందరూ కృతజ్ఞత లు తెలపాల్సిన అవసరం ఉంది. రూపొందించినటువంటి భాషను మరింతగా అభివృద్ధి చేయడానికి కృషి చేయాల్సిన అవసరం ఉంది. . దేశానికి అత్యున్నత స్థానం పార్లమెంట్ . పార్లమెంటులో ఎంపీలు రాజ్యసభ సభ్యులు, హిందీ ఆంగ్లము భాషలు మాత్రమే మాట్లాడే అవకాశంగా ఉండేది. మారుతున్న కాలంలో పెరుగుతున్న సాంకేతికతను వినియోగించుకొని పార్లమెంటులో 22 ప్రాంతీయ భాషల్లో మాట్లాడే అవకాశాన్ని ఇది చాలా గొప్ప విప్లవంగా భావించవచ్చు. ఎంపీలు ప్రాంతీయ భాషల్లో మాట్లాడిన అందరికీ తమ వారి భాషల్లో తర్జుమా మారి వారి భాషలోనే వినే టెక్నాలజీ అభివృద్ధి జరిగింది. దీంతో పార్లమెంట్ తోపాటు అసెంబ్లీ హాల్లో ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు తమ ప్రాంతీయ భాషను మాట్లాడడానికి అవకాశం నేడు భాష కారణంగా లభించింది.. ఇదే విధంగా ప్రాంతీయ భాషల్లో విద్య బోధనలో కూడా జరుగుతుంది. నేడు ఇంజనీరింగ్ స్థాయి విద్యలో 13 ప్రాంతీయ భాషల్లో ఇంజనీరింగ్ విద్యను నేర్చుకోవడానికి సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి జరిగింది. మరో అడుగు వేసినా..అంతర్జాతీయ భాషలను ఇతర రంగాల్లో కూడా వినియోగించుకోవడానికి కసరత్తు జరుగుతుంది.. ఇది చాలా మంచి పరిణామం.

తెలుగు భాష గొప్పది.

దేశభాషలందు తెలుగు లెస్స అంటారు. తెలుగు భాషకు ఉన్న మాధుర్యం ఇంత అంతా కాదంటారు. కానీ కాకి పిల్ల కాకికే ముద్దు అన్నట్లుగా ఎవరి ప్రాంతీయ భాష వారికి ముద్దుగా ఉంటుంది. భాష పై పట్టు కూడా ఉంటుంది . అమ్మ భాషగా ప్రారంభమైన ప్రాంతీయ భాషతోపాటు ఇతర భాషలను నేర్చుకోవడానికి ఎవరికీ అర్థం తరం లేదు. కానీ చాలా సర్వేల్లో తేలిన విషయాన్ని పరిశీలిస్తే మాత్రం ..ప్రతి 100 మంది విద్యార్థుల్లో కేవలం 40 మందికి మాత్రమే ప్రాంతీయ భాష మాట్లాడుతున్నట్లు వెల్లడయింది. ఇది ప్రాంతీయ భాషలకు గొడ్డలిపెట్టుగా మారనుంది. ఈమధ్య కేంద్ర ప్రభుత్వం చాలా రోజుల నుంచి విద్యార్థులు చేస్తున్న డిమాండును పరిగణలోకి తీసుకొని పోటీ పరీక్షలను తమ ప్రాంతీయ భాషల్లో రాయడానికి అంగీకరించడం జరిగింది. సామాన్యుడికి అర్థమయ్యే భాషలో ప్రభుత్వ కార్యకలాపాలు, కోర్టుల తీర్పులు, ఉంటే బావుంటుందని అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం సందర్భంగా ప్రజలు కోరుతున్నారు.