ముండ్లమూరు: 17 గ్రామాలలో భూముల రీ సర్వే
ముండ్లమూరు మండలంలోని 17 గ్రామాలలో భూముల రీ సర్వే పక్కాగా నిర్వహిస్తున్నట్లు సర్వే డిప్యూటీ తహసిల్దార్ రవికాంత్ తెలిపారు. ముండ్లమూరు లోని తహసిల్దార్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ... రెవిన్యూ రికార్డుల ఆధారంగా సర్వే పూర్తి చేస్తున్నట్లు రైతులకు విఆర్వోలు అవగాహన కల్పించాలన్నారు. సర్వే పూర్తిచేసిన భూమి వివరాలను వెంటనే ఆన్లైన్ చేయడం జరుగుతుందని ఆయన సూచించారు.
