ముండ్లమూరు : వైద్యశాల అభివృద్ధికి చర్యలు వేగవంతం
ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం ఎంపీపీ సుంకర సునీత బ్రహ్మానందరెడ్డి అధ్యక్షతన వైద్యశాల అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎంపీపీ మాట్లాడుతూ... రాష్ట్రప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో 37 రకాల మందులు అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. వైద్యశాల అభివృద్ధిలో భాగంగా రోగుల రాకపోకలకు వీలుగా రైలింగ్ ఏర్పాటు చేయాలన్నారు.
