ముండ్లమూరు: కూలీల ఆటో బోల్తా

కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా పడిన సంఘటన మండలంలోని పెదరావిపాడు వద్ద శనివారం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరికీ స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల మేరకు అద్దంకికి చెందిన కూలీలు మండలంలోని పూరిమెట్ల గ్రామంలో మిరపకాయలు కోసేందుకు వచ్చి తిరిగి వెళుతున్నారు. ఈ క్రమంలో పెద్దరావిపాడు వద్దకు వచ్చేసరికి ప్రమాదవశాత్తు వాహనం బోల్తా పడింది. గాయపడ్డ ఇద్దరిని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

ముండ్లమూరు: కూలీల ఆటో బోల్తా