పసుపుగల్లు : వీఓఏపై ADA, AO అధికారుల విచారణ
ముండ్లమూరు మండలం పసుపుగల్లు ఆర్బీకేలో పనిచేస్తున్న వీఓఏ ఆర్. స్వాతి భాయిపై ఆ గ్రామ రైతులు ఏడుకొండలు, శేషయ్య, శ్రీనివాసరెడ్డి, కృష్ణారెడ్డి స్పందనలో ఫిర్యాదు చేశారు. సోమవారం వ్యవసాయ శాఖ ఏడీఏ ఎఫ్రాయీం, ఏఓ మేరమ్మా విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామంలో వారిని విచారించారు. అయితే వీ ఓ ఏ పై ఫిర్యాదు చేసిన వారు మాత్రం విచారణకు హాజరు కాలేదని తెలిపారు.
