ముండ్లమూరు : ఆలయ విగ్రహ ప్రతిష్ట లో పాల్గొన్న మద్దిశెట్టి శ్రీధర్
ముండ్లమూరు మండలం భీమవరం గ్రామంలో రామాలయంలోని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి గురువారం మద్దిశెట్టి శ్రీధర్ పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, వేద పండితులు ఆశీర్వచనాలు స్వీకరించి, తీర్థ ప్రసాదాలు ఆయనకు ఆలయ నిర్వహకులు అందజేశారు. విగ్రహ ప్రతిష్ట అనంతరం ఆలయ నిర్వహకులు గజమాలతో ఆయనను సత్కరించారు. ఆలయ నిర్వహకులు ముందుగానే భారీగా ఏర్పాట్లు చేశారు.
