శ్రీరామనవమి ఉత్సవాల్లో పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్ పర్సన్

ముండ్లమూరు మండలంలోని భీమవరంలో రాముల వారి గుడి ప్రతిష్ట కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితుల ఆశీర్వాదం పొందారు. ఆలయ కమిటీ సభ్యులు ఆమెని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట మండల పార్టీ కన్వీనర్ అంజయ్య, జడ్పిటిసి రత్నం రాజు, వైస్ ఎంపీపీ నాగిరెడ్డి, చింతా శ్రీను మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

శ్రీరామనవమి ఉత్సవాల్లో పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్ పర్సన్