ముండ్లమూరు: బైకును ఢీకొట్టిన లారీ

ముండ్లమూరు మండలంలోని చిలకలేరు వద్ద మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తమ్ములూరు గ్రామానికి చెందిన చొప్పరపు గంగయ్య కు తీవ్ర గాయాలయ్యాయి. తలకు బలమైన గాయాలు కావడంతో 108 వాహనంలో అద్దంకి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం నిమిత్తం ఒంగోలు తీసుకెళ్లారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ముండ్లమూరు: బైకును ఢీకొట్టిన లారీ