ముండ్లమూరు:గడ్డి మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
ముండ్లమూరు మండలంలోని వేముల బండలో నల్లబోతుల చిన్న వెంకటేశ్వరరావు గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... కోటేశ్వరరావుకు ఇద్దరు కుమార్తెలు ఉండగా అల్లుళ్లతో మనస్పార్ధాలు ఏర్పడి ఇంటి దగ్గర ఉంటున్నారు. దీంతో ఆయన మనస్థాపం చెంది గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.కుమార్తెల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
