ముండ్లమూరు : పరీక్షా కేంద్రం వద్ద బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు
ముండ్లమూరులోని ఆదర్శ ప్రభుత్వా జూనియర్ కళాశాలలోని ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని మంగళవారం ఎస్సై సంపత్ కుమార్ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్ష సమయంలో కేంద్రం వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయాలని కోరారు. సిబ్బంది మహిళా పోలీసులు పాల్గొన్నారు.
