ముండ్లమూరు ఉమామహేశ్వరపురం లో భారీ దొంగతనం
ముండ్లమూరు మండలం ఉమామహేశ్వరపురంలో అమర, వెంకటేశ్వర్లు ఇంటి తాళాలు పగలుకొట్టి లోపలకు దూరిన దొంగలు బీరువాను పగలుకొట్టి అందులోని 25 కేజీల వెండి వస్తువులు,10 సవర్ల బంగారు నగలు,రూ.30 వేలు దోచుకొని వెళ్లారని భాదితుడు పోలీస్ లకు ఫిర్యాదు చేశాడు.కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వెంకటేశ్వర్లు కుటుంబంతో ఈ నెల 12న హైదరాబాద్ లో ఉన్న కొడుకు వద్దకు వెళ్లి తిరిగి, రావటంతో ఈ దొంగతనం బయట పడింది.
