సైబర్ నేరాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలి

తాళ్లూరులోని పోలీస్ స్టేషన్లో ఎస్సై ప్రేమ్ కుమార్ మంగళవారం స్థానిక మహిళా పోలీసులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా పోలీసులు పరిధిలో శాంతిభద్రతల స్థితిగతులను ఆయన అడిగి తెలుసుకున్నారు.. అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ సైబర్ నేరాలపై సచివాలయాల పరిధిలో ముమ్మరంగా ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే ఎవరైనా శాంతి భద్రతలకు విగాదం కలిగిస్తే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

సైబర్ నేరాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలి