తాళ్లూరులో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు
తాళ్లూరు మండలం తూర్పు గంగవరంలో నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఒంగోలు పార్లమెంటు అధ్యక్షులు నూకసాని బాలాజీ,దర్శి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నారపు శెట్టి పాపారావు, దర్శి మున్సిపల్ చైర్మన్ నారప శెట్టి పిచ్చయ్య తదితరులు పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు తదుపరి ఉచితంగా మెడికల్ క్యాంపు నిర్వహించారు.
