ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 34% ఇవ్వటాన్ని స్వాగతిస్తూ చంద్రబాబు నాయుడు కి శుభాకాంక్షలు తెలిపిన మారెళ్ల వెంకటేశ్వర్లు

ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 34% ఇవ్వటాన్ని స్వాగతిస్తూ చంద్రబాబు నాయుడు కి శుభాకాంక్షలు తెలిపిన మారెళ్ల వెంకటేశ్వర్లు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు  ఈరోజు జరిగిన ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ మంత్రివర్గ సమావేశంలో నామినేటెడ్ పదవుల్లో భాగంగా బీసీలకు 34% ఇస్తామని చెప్పడం చాలా సంతోషకరమైన విషయం.. అనీ అలాగే చంద్రబాబు నాయుడు నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు వర్తింపచేయాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయించింది... నామినేటెడ్ పోస్టుల్లో 34% బీసీ లకు అవకాశం కల్పించడం మరోసారి తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ అని నిరూపించుకోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి బీసీలకె ఇవ్వడం అలాగే గతంలో కూడా ఎన్నో కీలకమైన పదవులు స్పీకర్ పదవి గాని బీసీలకు ఇవ్వడం చాలా సంతోషం అనీ,ఒకసారి  తెలుగుదేశం పార్టీ గురించి ఆలోచిస్తే గతంలో లోక్ సభ స్పీకర్ గా జిఎంసి బాలయోగి (sc )ని నియమించడం.. అలాగే గతంలో తిరుపతి తిరుమల దేవస్థానం చైర్మన్గా పుట్టా సుధాకర్ యాదవ్ ను నియమించడం మరియు గతంలో శాసనసభ స్పీకర్ గా మరియు ఆర్థిక శాఖ మంత్రిగా యనమల రామకృష్ణ ను నియమించటం అలాగే గతంలో దేశానికి అత్యున్నతమైన రాష్ట్రపతి పదవిలో అబ్దుల్ కలాం (ముస్లిం మైనారిటీ) ని నియమించడంలో కూడా నారా చంద్రబాబునాయుడు కీలక పాత్ర పోషించారు అనే విషయాన్ని అందరూ తెలుసుకోవాలి అనీ ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా  నూకసాని బాలాజీ ని నియమించడం అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం డెవలప్మెంటకార్పొరేషన్ చైర్మన్ గా కూడా నియమించడం జరిగింది కాబట్టి ఈరోజు బీసీల పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ అని మరోక సారి చంద్రబాబు నాయుడు రుజువు చేశారు.. కాబట్టి ప్రకాశం జిల్లా బీసీల తరఫున ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి క్యాబినెట్ మంత్రులకి మరియు దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ గొట్టిపాట్ల లక్ష్మీ కడియాల లలిత సాగర్ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము అనీ అలాగే దర్శి నియోజకవర్గంలో కూడా బీసీలకు కీలకమైన పదవులు దక్కుతాయని ఆశిస్తున్నట్లు మారెళ్ల వెంకటేశ్వర్లు ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు తెలియచేశారు.