వేసవిలో అప్రమత్తత అవసరం

మారెళ్ళ ఆరోగ్య కేంద్రం పరిధిలోని సుంకర వారి పాలెం గ్రామంలో శనివారం వేసవి పై మహిళలకు వైద్యాధికారి మధు శంకర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వడదెబ్బ తగలకుండా జాగ్రత్త తీసుకోవాలని, పనులకు వెళ్లేటప్పుడు త్రాగునీరు తీసుకొని వెళ్లాలని సూచించారు. గ్రామంలో ఫ్యామిలీ ఫిజీషియన్ వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 55 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు పంపిణీ చేశారు.

వేసవిలో అప్రమత్తత అవసరం