ముండ్లమూరు మండలం పెద్దవుల గల్లు గ్రామంలో సర్పంచ్ పిచ్చయ్య ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన త్రాగునీటి చలివేంద్రాన్ని ఈఓపీఆర్డీ ఓబులేసు శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పిచ్చయ్య మాట్లాడుతూ.... వేసవికాలం దృష్ట్యా ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, వాలంటీర్లు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.