ముండ్లమూరు : పొగాకు అపహారానపై కేసు నమోదు
ముండ్లమూరు మండలంలోని పసుపుగల్లు గ్రామంలో ఎనిమిది క్వింటాళ్ల పొగాకు అపహారణపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సంపత్ కుమార్ తెలిపారు. పసుపుగళ్ళు గ్రామానికి చెందిన పేతురు తన పొలంలో పొగాకు గుచ్చిన తాడులు ఉంచగా, గుర్తుతెలియని వ్యక్తులు అపహారించారు. దీనితో స్థానిక స్టేషన్లో అందించిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
