ఆత్మహత్యకు ప్రయత్నించిన వివహిత మృతి
వివహిత పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడటంతో అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ముండ్లమూరు ఎస్సై సంపత్ కుమార్ తెలిపారు. ముండ్లమూరు మండలం మక్కినవారి పాలెం గ్రామానికి చెందిన శివకుమారి గృహంలో ఎవరు లేని సమయంలో పురుగు మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేసింది. అయితే శివ కుమారి ని ఒంగోలు రిమ్స్ కు తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందింది.మృతురాలి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
