పొగాకు దొంగిలించడానికి వచ్చిన వారిని పట్టుకున్న గ్రామస్తులు
ముండ్లమూరు మండలంలోని కమ్మవారిపాలెం గ్రామంలో పొలాల్లో పొగాకు చెక్కులను దొంగిలించడానికి వచ్చిన మహిళలను గ్రామస్తులు గమనించి వారిని పట్టుకొని స్థానిక ముండ్లమూరు పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. అదే విధంగా మండలంలోని ఈ మధ్య కాలంలో పసుపుగళ్ళు గ్రామంలో, వేములబండ గ్రామంలో పొగాకు చెక్కులను ఎవరో దొంగిలించా రని భాధితులు పోలీస్ స్టేషన్ లో తెలియజేసారు.
