ముండ్లమూరు : పోషణ పక్వాడ పై అవగాహన కార్యక్రమం
పోషణ పక్వాడ మీద అవగాహన కార్యక్రమంలో భాగంగా తాళ్లూరు ప్రాజెక్టు మారెళ్ళ సెక్టార్ ముండ్లమూరు మండలం పూరిమెట్ల గ్రామం అంగన్వాడి కేంద్రంలో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగనవాడి సూపర్వైజర్ యశోద మాట్లాడుతూ... చిరుధాన్యాలు, పౌష్టిక ఆహారం గురించి గర్భిణీ మహిళలకు, పిల్లలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్త విజయ కుమారి, ICDS సచివాలయం హెల్త్ సిబ్బంది పాల్గొన్నారు.
