ముండ్లమూరు తహసీల్దారుగా ఎండి నయీమ్ అహ్మద్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇక్కడ తహసీల్దారుగా పనిచేసిన ఎస్ ఉషారాణి జరుగుమల్లీ మండలానికి బదిలీ కావడంతో జరుగుమల్లిలో తహశీల్దారుగా పనిచేస్తున్న నయీమ్ అహ్మద్ ముండ్లమూరు మండలానికి బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో డిప్యూటీ తాహశిల్దార్ గా అనుభవం ఉందని, మండలంలోని ప్రజలు, అధికారులు, విలేకర మిత్రులు, రాజకీయ నాయకులు సహకరించాలని రెవెన్యూ సంబంధమైన ఏమైనా సమస్యలు ఉంటే తమను సంప్రదించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా మండల రెవెన్యూ అధికారులు ఆయనను సన్మానించారు