ముండ్లమూరు: అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ పట్టివేత
మండలంలోని తమ్మలూరు సమీపంలో చిలకలేరు వాగు నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ ను పట్టుకున్నట్లు ఎస్సై సంపత్ కుమార్ తెలిపారు. ఎస్ ఐ కథనం మేరకు వాగు నుంచి రాత్రి వేళలో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని సమాచారాన్ని ఇవ్వడంతో తమ సిబ్బందితో వెళ్లి దాడి చేసి ట్రాక్టర్ అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ట్రాక్టర్ ను తీసుకు వెళ్తున్న ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
