ముండ్లమూరు మండలం లోని పోలవరం క్రాస్ రోడ్డు వద్ద గల వేద ఫార్మసీ కళాశాల నందు శుక్రవారం ప్రెషర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రియ దర్శిని కాలేజీ ఆఫ్ ప్రార్మసి ప్రిన్సిపాల్ డాక్టర్ చందుబాబు, ముండ్లమూరు
తహశీ ల్దార్ ఉషారాణి పాల్గొని విద్యార్థులు ఉద్దేశించి మాట్లాడారు. వేద కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ. యం. ఎస్ సుధాకర్ బాబు మాట్లాడుతూ విద్యార్థులు తమ నైపుణ్యం పెంచుకోవడం ద్వారా భవిష్యత్తు తరాలకు నాణ్యమైన మందులను కనుగొనె అవకాశం ఉందని అన్నారు. ప్రతి విద్యార్థి వారి విద్యార్థి దశ లో ప్రస్తుత టెక్నాలజీ పట్ల పూర్తి అవగాహనా తో అన్ని నూతన ఫార్మా పద్ధతులు ను తెలుసుకోవడం ద్వారా భవిష్యత్తు శాస్త్ర వేత్తలు గా ఎదుగుతారని అన్నారు. అనంతరం క్రీడా పోటీలలో విజేతలకు బహుమతులు అందచేశారు.