ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి గాయాలు
ముండ్లమూరు మండలం శంకరాపురం,నూజిల్లపల్లి గ్రామాల మధ్య రోడ్డు ప్రమాదం చోటు చేసుకొంది.కట్టెల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో ధ్విచక్ర వాహనం పై వున్నా ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులు తూర్పు కంభంపాడుకు చెందిన కృష్ణవేణి, జగదీష్ లు గా స్థానికులు గుర్తించారు.వారిని మెరుగైన వైద్యం కోసం అద్దంకి ప్రభుత్వ అస్పత్రికి తరలించారు.
