ముండ్లమూరు మండలంలో 300 కోళ్లు మృతి

ముండ్లమూరు మండలంలోని పసుపుగల్లులో ఆదివారం సుమారు 300 కోళ్లు మృతి చెందాయి. గ్రామానికి చెందిన పండుగల శ్రీనివాసరెడ్డి చెందిన కోళ్ల ఫారం లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆదివారం మండలంలో 36 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. దీనికి తోడు మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఉక్కపోతతో కోళ్లు మృతి చెందాయని యజమాని తెలిపారు.

ముండ్లమూరు మండలంలో 300 కోళ్లు మృతి