ముండ్లమూరు :ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన కారు.. ఒకరు మృతి
మండలంలోని రెడ్డి నగర్ వద్ద కారు, బైకు ఢీకొన్న సంఘటన ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తిగత వివరాలు తెలియాల్సింది.
