కుక్కల దాడిలో 30 పొట్టేళ్ల పిల్లలు మృతి
వీధి కుక్కల దాడిలో 30 పొట్టేళ్ల పిల్లలు మృతి చెందిన సంఘటన ముండ్లమూరు మండలం శంకరాపురంలో మంగళవారం వెలుగు చూసింది. గ్రామానికి చెందిన అంజియ్యకు చెందిన 8 పిల్లలు, ప్రసాద్ కు చెందిన 16 పిల్లలు, అంకమ్మరావుకు చెందిన 12 పొట్టేల పిల్లలు పాకలో ఉంచి సోమవారం రాత్రి ఇంటికి వెళ్లిపోయారు. ఉదయం వచ్చి చూసేసరికి మృతి చెందినట్లు గుర్తించారు. వీటి విలువ సుమారు రూ.1.50 లక్షలు ఉంటుందని బాధితులు తెలిపారు.
