తాళ్లూరు మండలంలో 2000 ఎకరాల్లో బత్తాయి సాగు
మండలంలో బత్తాయి తోటలను సాగుచేసిన రైతులు వేరు కుళ్ళు తెగులు అధికంగా పంటకు ఆశించిన నేపథ్యంలో తగిన నివారణ చర్యలు చేపట్టాలని మండల వ్యవసాయ శాఖ అధికారి ప్రసాదరావు తెలిపారు. తాళ్లూరులోని ఏవో కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ మండలంలో 2000 ఎకరాలలో బత్తాయిని రైతులు సాగు చేస్తున్నారు.ఏవైనా తెగుళ్ళకు సంబంధించి వెంటనే వ్యవసాయ శాఖ సిబ్బందినిసంప్రదించి సలహాలు పొందాలన్నారు.
