ప్లాస్టిక్ వాడితే అనర్ధాలు :సర్పంచ్ కోటేశ్వరమ్మ బ్రహ్మారెడ్డి
ప్లాస్టిక్ వాడితే అనర్ధాలకు దారితీస్తుందని తాళ్లూరు మండలం వెలుగు వారి పాలెం సర్పంచ్ ముచ్చుమారి కోటేశ్వరమ్మ బ్రహ్మారెడ్డి తెలిపారు. వెలుగు వారి పాలెం శివాలయం పరిధిలో బుధవారం గ్రామ సచివాలయంలో సర్పంచ్ కోటేశ్వరమ్మ బ్రహ్మారెడ్డి అధ్యక్షతన ప్రజలకు ప్లాస్టిక్ వాడితే తలెత్తే అనర్ధాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది,వాలంటీర్లు,పంచాయితీ సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.
