గన్నవరం లో ఉద్రిక్తత - టి డి పి కార్యాలయంపై దాడి

గన్నవరం లో ఉద్రిక్తత - టి డి పి కార్యాలయంపై దాడి
గన్నవరం లో ఉద్రిక్తంగా మారిన పరిస్థితి లు చూస్తూనే ఉండండి BSR NEWS తెలుగు లో

గన్నవరం లో ఉద్రిక్తత - టి.డి.పి. కార్యాలయం ద్వంసం

BSR NEWS TELUGU   www.bsrnews.in

కృష్ణా జిల్లా గన్నవరంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గన్నవరం నియోజవర్గంలో రాజకీయ వేడి కొనసాగుతుంది. ఈ సారి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులకు, టీడీపీ శ్రేణుల మధ్య చోటుచేసుకుంది. వంశీపై ఫిర్యాదు చేసేందుకు భారీ ర్యాలీగా టీడీపీ శ్రేణులు పోలీస్టేషన్ కు బయలు దేరారు. ఇదే సమయంలో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో వంశీ వర్గీయులకు, టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో వంశీ వర్గీయులు టీడీపీ ఆఫీసు వద్దకు వెళ్లి దాడికి పాల్పడ్డారు.

గన్నవరం లో సోమవారంనాడు ఉద్రిక్తత చోటు చేసుకుంది. గన్నవరంలోని టీడీపీ కార్యాలయంలో వాహనాలపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వర్గీయులు నిప్పు పెట్టారు. టీడీపీ ఆఫీస్ పై వంశీ వర్గీయులు దాడికి దిగారు. టీడీపీ కార్యాలయం అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. కొన్ని రోజుల క్రితం టీడీపీ అధినాయకులపై వంశీ  పలు వ్యాఖ్యలు చేశారు. దీంతో ఎమ్మెల్యే వంశీ తీరుపై టీడీపీ గరంగరంగా ఉంది. వంశీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ టీడీపీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ కు ర్యాలీ వెళ్లారు. ఈక్రమంలోనే వంశీ వర్గీయులకు, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో వంశీ వర్గీయులు టీడీపీ ఆఫీస్ పై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఓ కారు కూడా నిప్పంటించారు. మంటలు ఆర్పేందుకు వచ్చిన అగ్నిమాపక వాహనాన్ని వంశీ వర్గీయులు అడ్డుకున్నారు. వంశీకి వార్నింగ్ ఇచ్చిన టీడీపీ నేతల ఇళ్లకు వంశీ వర్గీయులు వెళ్లారని సమాచారం. ప్రస్తుతం గన్నవరంలో ఉద్రిక్తత వాతారవణం నెలకొంది.