Telangana Assembly Elections 2023 | హైదరాబాద్‌లో మందకొడిగా పోలింగ్ : నగర ఓటర్ నిర్లిప్తత వీడాలి

BAR NEWS
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ (Telangana Assembly Elections 2023) కొనసాగుతోంది. గురువారం మధ్యాహ్నం 1 గంట వరకూ రాష్ట్రవ్యాప్తంగా 36.68 శాతం పోలింగ్ నమోదైంది.
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ (Telangana Assembly Elections 2023) కొనసాగుతోంది. గురువారం మధ్యాహ్నం 1 గంట వరకూ రాష్ట్రవ్యాప్తంగా 36.68 శాతం పోలింగ్ నమోదైంది. ఇక హైదరాబాద్‌లో అత్యల్పంగా కేవలం 20.79 శాతం పోలింగ్ నమోదవడం ఓటింగ్‌పై నగర ఓటర్ నిరాసక్తతను వెల్లడిస్తోంది.
నగర, పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం పెరగాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ అన్నారు. నగర ఓటరు ఇండ్లను వీడి పోలింగ్ కేంద్రాలకు తరలిరావాలని మంత్రి కేటీఆర్ కోరారు. ఇక మెదక్‌లో 50 శాతంపైగా పోలింగ్ నమోదవగా, మహబూబ్‌నగర్‌లో 45 శాతం, కరీంనగర్ 40.73, ఆదిలాబాద్ 41.88, గద్వాల్ 49.29, ఖమ్మం 42 శాతం, మంచిర్యాల 42.74 శాతం, మహబూబాబాద్ 48 శాతం, కామారెడ్డి 41 శాతం పోలింగ్ నమోదైంది.