తెలంగాణ లో వణుకు పుట్టిస్తున్న విషజ్వరాలు.. BSR NEWS

తెలంగాణ లో వణికిస్తున్న వైరల్ జ్వరాలు*
ఇటీవల భారీగా వర్షాలు కురవడంతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పారిశుధ్యం ప్రధాన సమస్యగా మారింది. స్వచ్ఛ గ్రామాలు, పట్టణాలుగా ప్రకటనలకే పరిమితం అయ్యారని క్షేత్ర స్థాయిలో స్పష్టంగా కనిపిస్తోంది. గడిచిన పదిరోజులుగా ఉత్తర తెలంగాణ ఉమ్మడి నిజామాబాద్, అదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని పల్లెలు, పట్టణాలు జ్వరాలతో వణికిపోతున్నాయి.
ఏ పల్లెను చూసినా జ్వరాలు, దగ్గు, జలుబుతో ప్రజలు అల్లాడిపోతున్నారు*
పల్లెలు, పట్టణాల్లో సరైన పారిశుధ్య పనులు చేపట్టకపోవడంతో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఎటుచూసినా మురికి కూపాలుగా మురికి కాలువలు కనిపిస్తున్నాయి. చెత్త, చెదారం పేరుకుపోయి మురికివాడలుగా మారిపోయాయి.
వర్షాకాలం వచ్చిందంటే వైరల్ జ్వరాలు, వాంతులు, విరోచనాలతో జనాలు అవస్థలపాలవుతున్నారు. రోగాల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవడంలో అధికార యంత్రాంగం విఫలం అవుతుందనే విమర్శలు ఉన్నాయి.
ఉత్తర తెలంగాణ జిల్లాల్లో డెంగ్యూ కోరలు చాచింది. తీవ్రమైన జ్వరం, ప్లేట్‌లెట్స్ పడిపోవడంతో జనం డెంగ్యూ అంటేనే బెంబేలెత్తి పోతున్నారు.
డెంగ్యూ జ్వరాలతో పాటు అంతుచిక్కని వైరల్ ఫీవర్ మరింత భయాందోళనలు కలిగిస్తోంది. సాధారణ మనిషికి ప్లేట్‌లెట్స్ లక్ష యాభై వేలు పైగా ఉండాలి. జ్వరం రావడంతో ఒక్కసారిగా 30 వేల లోపుకు ప్లేట్‌లెట్స్ పడిపోతున్నాయి.
అత్యవసరంగా ప్లేట్స్‌లెట్స్ ఎక్కించడం, వెంటనే ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందివ్వకపోతే రోగి మరణిస్తున్న సంఘటనలు ఉన్నాయి...