Hyderabad Customs Search

శంషాబాద్‌: నగరంలోని శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. షూ కింద ప్రత్యేక ఏర్పాట్లు చేసుకొని అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న ప్రయాణికులను అదుపులోకి తీసుకున్నారు. సూడాన్‌ నుంచి వచ్చిన 23 మంది ప్రయాణికుల నుంచి సుమారు 15 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారం విలువ సుమారు రూ. 7.90 కోట్లు ఉంటుందని కస్టమ్స్‌ అధికారులు తెలిపారు. ఈ మేరకు నలుగురు నిందితులను అరెస్టు చేసి మిగతా వారిని విచారిస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఈ మధ్యకాలంలో సీజ్‌ చేసిన బంగారంలో ఇదే అత్యధికమని హైదరాబాద్‌ కస్టమ్స్‌ అధికారులు తెలిపారు.

Hyderabad Customs Search