ప్రమాదవశాత్తు చెరువు లో పడి యువకుడు గల్లంతు

ప్రమాదవశాత్తు చెరువు లో పడి యువకుడు గల్లంతు
రెండు గంటల తర్వాత లభ్యమైన యువకుడి శవం

చెరువులో పడి యువకుడు గల్లంతు 

ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ యువకుడు గల్లంతైన సంఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం బీర్కూరు మండలంలో చోటు చేసుకుంది. తిమ్మాపూర్ గ్రామానికి చెందిన సాయిబాబా అనే యువకుడు హైదరాబాద్లో చదువుకుంటున్నాడు. సెలవులు ఉండడంతో రెండు రోజుల క్రితం స్వగ్రామం తిమ్మాపూర్ వచ్చారు. తిమ్మాపూర్ ఆలయం వద్ద చెరువులో ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. జాలర్లు రెండు గంటల పాటు శ్రమించి సాయిబాబా మృతదేహాన్ని వెలికి తీశారు. ఈ మేరకు బీర్కూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.