మద్యం పై ఉన్న శ్రద్ధ విద్య, వైద్యం పై ఏది? |BSR NEWS|

మద్యం పై ఉన్న శ్రద్ధ విద్య, వైద్యం పై ఏది? |BSR NEWS|

హైదరాబాద్:  మద్యం పై ఉన్న శ్రద్ధ విద్య వైద్యం పై ఏది??!

రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై ప్రభుత్వలు చూపుతున్న శ్రద్ధ శక్తులు ఇతర రంగాలపై చూపకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది తాజాగా రెస్టారెంట్లతోపాటు మద్యం షాపుల్ని కూడా 24 గంటలు తెరిచి ఉంచడానికి ప్రత్యేక జీవో జారీ చేయడం వెనక మద్యం అమ్మకాన్ని పెంచి ప్రజల్ని మత్తులో ఉంచడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో యువతతో పాటు టీనేజ్ విద్యార్థులు కూడా లక్షల సంఖ్యలో మద్యానికి బానిసలు అయ్యారు. ప్రభుత్వాలు ఆదాయం కోసం మద్యం అమ్మకాలపై దృష్టి సారించకుండా సంస్కరణల బాట పట్టి విద్య వైద్య రంగాలను మెరుగుపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది..