*జీహెచ్‌ఎంసీ నిర్లక్ష్యం వల్లే బాలుడు మృతి*
*- హైకోర్టు*
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ( జీహెచ్‌ఎంసీ ) నిర్లక్ష్యం వల్లే నాలుగేళ్ల బాలుడి ప్రాణాలు పోయాయని తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఆదివారం నాడు వీధికుక్కలు నాలుగేళ్ల బాలుడిపై దాడి చేసి చంపిన ఘటనపై గురువారం విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)పై తీవ్ర స్థాయిలో మండిపడింది. అంబర్‌పేట్‌లోని గోల్నాక ప్రాంతంలో వీధికుక్కల దాడిలో నాలుగేళ్ల ప్రదీప్ మృతి చెందాడన్న వార్తలపై స్పందించిన హైకోర్టు బుధవారం ఈ వ్యాజ్యాన్ని సుమోటోగా విచారణకు స్వీకరించింది. గురువారం విచారణ ప్రారంభించిన హైకోర్టు బాలుడి హత్య 'తీవ్ర బాధాకరం' అని పేర్కొంది. నగరంలో ఇలాంటి ఘటనలు జరుగుతుంటే జీహెచ్‌ఎంసీ ఏం చేస్తుందో చెప్పాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.