TS Assembly Elections | మెదక్ ఫస్ట్.. హైదరాబాద్ లాస్ట్.. 1 గంటకు 36.68 శాతం మేర పోలింగ్ నమోదు

BSR NEWS
TS Assembly Elections | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (TS Assembly Elections ) పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంటల వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 36.68 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు (Voting percentage) ఎన్నికల అధికారులు ప్రకటించారు.
TS Assembly Elections | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (TS Assembly Elections ) పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది. పలుచోట్ల ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యమైంది. పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. మధ్యాహ్నం 1 గంటల వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 36.68 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు (Voting percentage) ఎన్నికల అధికారులు ప్రకటించారు. అత్యధికంగా మెదక్ జిల్లాలో 50.8 శాతం పోలింగ్ నమోదుకాగా.. అత్యల్పంగా హైదరాబాద్‌లో 20.79 శాతం పోలింగ్ నమోదైంది.
ఆదిలాబాద్‌లో 41.88 శాతం, భద్రాద్రిలో 39.29 శాతం, హన్మకొండలో 35.29 శాతం, జగిత్యాలలో 46.14 శాతం, జనగామలో 44.31 శాతం, భూపాలపల్లిలో 49.12 శాతం, గద్వాల్‌లో 49.29 శాతం, కామారెడ్డిలో 40.78 శాతం, కరీంనగర్‌లో 40.73 శాతం, ఖమ్మంలో 42.93 శాతం, ఆసిఫాబాద్‌లో 42.77 శాతం, మహబూబాబాద్‌లో 46.89 శాతం, మహబూబ్‌నగర్‌లో 44.93 శాతం, మంచిర్యాలలో 42.74 శాతం, మేడ్చల్‌లో 26.70 శాతం, ములుగులో 45.69 శాతం, నాగర్ కర్నూల్‌లో 39.58 శాతం, నల్గొండలో 39.20 శాతం, నారాయణపేటలో 42.60 శాతం, నిర్మల్‌లో 41.74 శాతం, నిజామాబాద్‌లో 39.66 శాతం, పెద్దపల్లిలో 44.49 శాతం, సిరిసిల్లలో 39.07 శాతం, రంగారెడ్డిలో 29.79 శాతం, సంగారెడ్డిలో 42.17 శాతం, సిద్దిపేటలో 44.35 శాతం, సూర్యాపేటలో 44.14 శాతం, వికారాబాద్‌లో 44.85 శాతం, వనపర్తిలో 40.40 శాతం, వరంగల్‌లో 37.25 శాతం, యాదాద్రిలో 45.07 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.