PM Modi: చిరు, పవన్ లను హత్తుకొని.. ఫిదా చేసిన మోడీ.. వైరల్ వీడియో

BSR NEWS
మెగా కుటుంబం అంటే ప్రధాని మోదీకి ఎంతో గౌరవం. ఇది చాలా సందర్భాల్లో బయటపడింది. అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. భీమవరంలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహ ఆవిష్కరణకు చిరంజీవి సైతం ప్రత్యేక ఆహ్వానం అందింది. అదే సమయంలో ఏపీ సీఎం గా జగన్ ఉండేవారు.
PM Modi: ఒకవైపు పవర్ స్టార్, మరోవైపు మెగాస్టార్, మధ్యలో ప్రధాని మోదీ.. ఈ కలయిక వేరు కదా? ఈ దృశ్యం నిజంగా ఆవిష్కృతం అయ్యింది. ఇందుకు ఏపీ ప్రభుత్వ ప్రమాణస్వీకారం వేదికగా మారింది. కొద్ది సమయం కిందట ఏపీ సీఎం గా చంద్రబాబు, మంత్రిగా పవన్ తో పాటు మరికొందరు ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. జాతీయ స్థాయి నాయకులతో పాటు సినీ సెలబ్రిటీలు తరలివచ్చారు. వేడుకగా సాగిన ప్రమాణ స్వీకార మహోత్సవం అనంతరం ప్రధాని వెళ్తుండగా పవన్ రిక్వెస్ట్ చేశారు. చిరంజీవి వద్దకు తీసుకెళ్లారు. ఆ ముగ్గురు సందడి చేశారు.
మెగా కుటుంబం అంటే ప్రధాని మోదీకి ఎంతో గౌరవం. ఇది చాలా సందర్భాల్లో బయటపడింది. అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. భీమవరంలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహ ఆవిష్కరణకు చిరంజీవి సైతం ప్రత్యేక ఆహ్వానం అందింది. అదే సమయంలో ఏపీ సీఎం గా జగన్ ఉండేవారు. కానీ ప్రధాని మోదీ మాత్రం జగన్ కంటే చిరంజీవికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. చిరంజీవితో ఆప్యాయంగా గడిపారు. సంతోషకర విషయాలను పంచుకున్నారు. పవన్ విషయంలో సైతం మోడీ అభిప్రాయం అదే. 2014లో ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు తెలిపిన పవన్ ఎన్నడు స్వప్రయోజనాల జోలికి వెళ్లలేదు. 2019 ఎన్నికల తర్వాత ఎన్డీఏతో జత కట్టినా కేంద్ర పెద్దలకు అనవసరంగా కలవలేదు. కానీ ప్రధాని మాత్రం కొణిదెల కుటుంబానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. ఇప్పుడు ఏపీలో కూటమి గెలుపు వెనుక పవన్ ఉన్నారన్నది అందరికీ తెలిసిన విషయమే. అందుకే ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు పవన్ కు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. అందుకే మెగా కుటుంబం మొత్తం ఈ ప్రమాణ స్వీకార వేడుకలకు హాజరయ్యింది.
ప్రధాని మోదీ సమక్షంలో పవన్ ప్రమాణ స్వీకారం చేశారు. వేదికపై చిరంజీవి, ప్రాంగణంలో కుటుంబం సందడి చేసింది. అటు పవన్ ప్రమాణాన్ని చూసి చిరంజీవి ఎమోషన్ అయ్యారు. అటు పవన్ సైతం ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం సోదరుడి కాలికి నమస్కరించే ప్రయత్నం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం ప్రధాని వేదిక నుంచి వెళుతున్న క్రమంలో పవన్ చిన్న రిక్వెస్ట్ చేశారు. చిరంజీవిని కలిపే ప్రయత్నం చేశారు. అప్పుడే ప్రధాని మెగా బ్రదర్స్ ను ముందుకు తీసుకెళ్లి ప్రజలకు అభివాదం చేశారు. దగ్గరకు తీసుకుని ఆత్మీయతను పంచారు. ఈ క్రమంలో ఎమోషన్ అయిన చిరంజీవి ప్రధాని సమక్షంలోనే.. సోదరుడు పవన్ బుగ్గలను నిమిరి తన ఆత్మీయతను చాటి చెప్పారు. సభా వేదిక కింద ఉన్న రామ్ చరణ్ ఈ దృశ్యాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఇవే వైరల్ గా మారాయి. జనసైనికులు, మెగా అభిమానులు ఈ ఫోటోలను చూసి తెగ ఆనంద పడుతున్నారు.