విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న వైసీపీ... విమర్శలు చేసిన పుట్లూరి కొండారెడ్డి- BSR NEWS

ఇంటర్ విద్య పూర్తి చేసి ఇన్నాళ్లయినా ఇప్పటివరకు సెర్టిఫికెట్లు అందించలేని స్థితి లో వైకాపా ఉందని, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి నిద్రపోతున్నారని దర్శి కాంగ్రెస్ ఇంచార్జి పుట్లూరి కొండారెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి లేదు విధ్వంసం తప్ప దానికి తోడు బాధాకరమైన విషయం ఏమిటంటే ఇంటర్మీడియట్ విద్యార్థులు పరీక్ష ఫలితాలు వచ్చి ఐదు నెలలు పూర్తి కావస్తుంది కానీ వారికి ఇంతవరకు ఒరిజినల్ మెమొలు ఇవ్వలేదు దీన్నిబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన ఎలా సాగిస్తుందో అర్థం అవుతుంది అసలు విద్యాశాఖ మంత్రి ఏం చేస్తున్నాడు ఉన్నాడా లేడా దీనిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి విద్యార్థులు తన తదుపరి విద్యను అభ్యసించడానికి వెళ్లే తరుణంలో కాలేజీ వారు ఒరిజినల్ సర్టిఫికెట్లు అడుగుతున్నారు కానీ ఇక్కడ ఒరిజినల్ రాలేదు విద్యార్థులు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వారి జీవితాలతో ఆడుకోవటం ఈ ప్రభుత్వానికి తాగదు ఆ సర్టిఫికెట్లకు అయ్యే ఖర్చు కూడా విద్యార్థుల దగ్గరుండి వసూలు చేశారు కదా అయినా ఇంతవరకు వాళ్లకు అందించకపోవడంలో మీ నిర్లక్ష్యం ఏమిటి? విద్యార్థుల జీవితాలతో ఆడుకునే హక్కు మీకు ఎవరు ఇచ్చారు ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది త్వరలో కాని మీరు విద్యార్థులకు ఒరిజినల్ సర్టిఫికెట్లు అందించలేని పక్షంలో విద్యార్థులతో కలిసి కలెక్టరేట్ దగ్గర నిరసన చేయడం జరుగుతుంది