సత్య కుమార్ పై దాడిని ఖండించిన దర్శి అసెంబ్లీ కన్వీనర్ మాడపాకుల శ్రీను

BSR న్యూస్, దర్శి: రాజధాని రైతులకు మద్దతుగా నిలిస్తే దాడులు చేస్తారా? అని మండిపడ్డారు దర్శి బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ మాడపాకుల శ్రీను. బీజేపీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్ పై దాడి గర్హనీయం. ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం భూములిచ్చిన రైతులు 1200 రోజులుగా చేస్తున్న దీక్షలకు మద్దతు పలికిన వై.సత్య కుమార్ పై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడటం గర్హనీయం. అధికారంలో ఉన్న వైసీపీ దాదాగిరీ పరాకాష్టకు చేరిందనే వాస్తవం ఈ దాడితో మరోమారు తేటతెల్లమయింది. ఈ దాడిని ప్రతి ప్రజాస్వామ్యవాది ఖండించాలి అని దర్శి బీజేపీ కన్వీనర్ మాడపాకుల శ్రీను తెలిపారు.